• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

Press Release

Filter:

వరద బాధితులకు నరేష్ ఎగ్జిక్యూటివ్ బాయ్స్ హాస్టల్ విరాళం రూ.50 వేల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందించిన కొప్పినేని నరేష్

Published on: 10/09/2024

విజయవాడ వరద బాధితులకు భీమవరం ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్న నరేష్ ఎగ్జిక్యూటివ్ బాయ్స్ హాస్టల్ యజమాని కొప్పినేని నరేష్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలిసి రూ.50 వేల చెక్కును అందించారు. బాధితులకు తోడుగా నిలవడంలో తమ వంతు బాధ్యతగా విరాళాన్ని అందించినట్లు నరేష్ తెలిపారు.

More

పేదలకు అందించవలసిన రేషన్ సరుకులు పంపిణీ అవకతవకులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు…

Published on: 10/09/2024

మంగళవారం భీమవరం మండలం రాయలం గ్రామంలో నెం.54 రేషన్ షాపును, నిత్యవసర వస్తువులను డోర్ డెలివరీ చేస్తున్న (యండియు) వాహనం నెంబర్ డబ్ల్యు జి 007 ను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ పంపిణీ చేస్తున్న ఎండియు వాహనంలో, చౌక ధరల దుకాణంలో రికార్డులు ప్రకారం ఉండవలసిన స్టాకును ఈ పాస్ తో స్టాకు నిల్వలను తనిఖీ చేసి అదనంగా వున్న పంచదార నిల్వ తేడాను గమనించి, ఎండియు […]

More

ఉప్పుటేరు వద్ద కొల్లేరు వరద నీటి ఇబ్బంది లేని విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 09/09/2024

సోమవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని ఆకివీడు మండలం దుంపగడప వద్ద ఉప్పుటేరులో గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మాత్రమే సముద్రంలో కలుస్తుందన్నారు. కొల్లేరు ఉప్పుటేరు వద్ద కలిసే ప్రాంతంలో నీటి ప్రవాహానికి కిక్కిస అడ్డంకిగా ఏర్పడిందన్నారు. ఉప్పుటేరు రైల్వే […]

More

ఉచిత ఇసుకను వినియోగదారునికి సరసమైన రవాణా చార్జీలతో అందించేందుకు టిప్పర్లు, లారీలు యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు .

Published on: 09/09/2024

సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని టిప్పర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ తో సమావేశమై ఉచిత ఇసుక రవాణా చార్జీలను సమీక్షించడమైనది. ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత ఇసుకను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో నూతన ఇసుక పాలసీని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఉచిత ఇసుకకు ఏ ఒక్కరికి రవాణా చార్జీలు భారం కాకూడదని, అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఛార్జీలతో వెసులుబాటు కల్పించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు. […]

More

బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Published on: 09/09/2024

సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి మార్కెటింగ్, సివిల్ సప్లైస్, బియ్యం, కందిపప్పు హోల్ సేల్ అసోసియేషన్ తో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయలు ధరలు స్థిరీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు దృష్టికి వచ్చినట్లు తెలిపారు. హోల్ సేల్ రేట్లకే అన్ని షాపుల్లో ఒకే విధమైన ధరకు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత నెల […]

More

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 09/09/2024

జిల్లాలో గత నెల రోజుల నుండి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయడంతో పాటు, సూపర్ క్లోరినేషన్ కాన్సెప్ట్‌ను అవలంబించాలన్నారు. అన్ని కార్యకలాపాలు పిఆర్-వన్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో నిలిచిపోయిన నీటిని తొలగించాలన్నారు. ఎక్కడ చెత్త పేరుకుపోకుండా చెత్త కుప్పలను […]

More