Press Release
రభీ ధాన్యం కొనుగోళ్లకు వేగవంతమైన చర్యలు ప్రారంభించాలని, కొనుగోళ్లలో రైతుకు లాభం చేకూర్చేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 01/04/2025మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి ధాన్యం సేకరణ కమిటీ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమగోదావరిజిల్లాలో రబీ 2024-25 సీజనుకుగాను రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు 348 రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేయడం జరిగినదన్నారు. ఈ రబీ సీజనులో కనీస మద్దతు ధర ప్రతి క్వింటాల్ ధాన్యముకు సాధారణ రకం రూ.2,300/- చొప్పున మరియు గ్రేడ్-ఏ […]
చేనేత వస్త్రాలు మన్నికలో, నాణ్యతలో మేటిగా ఉంటాయని, ఆరోగ్యవంతమైన చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.
Published on: 01/04/2025మంగళవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు అన్ని స్టాల్స్ ను సందర్శించి వాటి తయారీ, మన్నిక, ప్రాంతం, ధర తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో చేనేతదారులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు ఒక […]
జిల్లాలో సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి తెలిపారు.
Published on: 01/04/2025మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖలు ప్రభుత్వ pకార్యదర్శి మరియు పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియామకం కాబడి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఎ.సూర్యకుమారి కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశంలో జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన […]
ట్రాన్స్ జెండర్స్ సామాజిక పింఛన్లను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం కల్పిస్తున అవకాశాలతో మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖల ప్రభుత్వ కార్యదర్శి మరియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి అన్నారు.
Published on: 01/04/2025మంగళవారం భీమవరం పట్టణం దుర్గాపురం, పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి పెన్షనర్లతో పేరుపేరునా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు, చదువుకుంటున్నవారి వివరాలు, ఏమేమి పనులు చేస్తున్నారు, స్వయం సహాయక సంఘాల గ్రూపులలో సభ్యులుగా ఉన్నారా తదితర వివరాలను […]
విశ్వావసు నామ నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాలలో పురోగమించి, అందరి జీవితాలలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
Published on: 30/03/2025ఆదివారం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ఘనంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట శాసనసభ్యులు పితాని […]
జిల్లాలోని వివిధ కంపెనీలకు అవసరమైన సిబ్బంది కొరతను తీర్చేందుకు వివిధ కోర్సులు పూర్తిచేసుకున్న యువతను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 29/03/2025శనివారం స్థానిక హోటల్ ఆనంద ఇన్ మీటింగ్ హాల్ నందు జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇండస్ట్రీ మీట్” కు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో పలు దఫాలుగా “ఉద్యోగ దిక్సూచి” పేరిట ఉద్యోగాల కల్పనకు మేళాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మేళాలో నిర్వహించినప్పుడు నిరుద్యోగ యువత హాజరవుతున్నారని, […]
అమరావతిలో ఆదివారం జరిగే పి-4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉండేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 29/03/2025జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి ఆదివారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న పి-4 కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నుండి రైతులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు జిల్లా నుండి హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ, డి ఆర్ డి ఎ, పరిశ్రమల, మత్స్య, ఎస్సీ, బీసీ, సంక్షేమ, మెప్మా, విద్యాశాఖల అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు, ఎం పి డి వో లతో గూగుల్ మీట్ ద్వారా […]
లేసు అల్లికలు ప్రపంచంలోనే మేటిగా నిలిచేలా మంచి నాణ్యతతో తయారుచేస్తే, మెరుగైన మార్కెటింగ్ లభిస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 29/03/2025శనివారం నరసాపురం మండలం రుస్తుం బాధ గ్రామంలోని సీతారాంపురం లేస్ పార్కును జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సందర్శించారు. ఎగుమతులు, దిగుమతులు కార్యకలాపాలు నిర్వహించే బాంబే ఎగ్జిమ్ బ్యాంకు సౌజన్యంతో లేస్ అల్లికదారులకు మెరుగైన శిక్షణను కల్పించి, శిక్షణను పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందించే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత లేస్ పార్క్ నందు ఏర్పాటుచేసిన లేసు అల్లికలలో నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. […]
నరసాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణినరసాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/03/2025రంజాన్ పర్వదినాల సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ముస్లిం సోదర, సోదరిమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసి నియోజకవర్గ ప్రజల తరఫున ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపర్ ఇండిపెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇటువంటి వేడుకలను […]
గ్రౌండ్ ట్రూతింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 28/03/2025శుక్రవారం పెనుగొండ మండలం పైలెట్ గ్రామం దేవా లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పూర్తిచేసిన అనంతరం హెచ్చుతగ్గులకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోగా, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు, భూ యజమానులతో కలిసి వారి భూమి వద్దకే వెళ్లి పరిశీలించారు. భూ యజమాని సమక్షంలో తిరిగి సర్వే చేయించగా, కొలతలలో ఎటువంటి తేడా లేకుండా ఖచ్చితంగా రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భూ యజమానితో మాట్లాడుతూ కొలతల్లో […]