మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 11/11/2026
WhatsApp Image 2026-11-11 at 3.28.36 PM

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారని తెలిపారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, విద్య ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి. గ్లోరియా, కె.ఆర్.ఆర్.సి. డిప్యూటీ కలెక్టర్ పి. ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. సునీత, జిల్లా పంచాయతీ అధికారి పి. విజయభాస్కర్, మైనారిటీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ హెచ్.వి.ఎస్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.