*-జిల్లాలో అక్టోబర్ 2026 నాటికి రూ. 147.46 కోట్లు పన్నులు వసూలు. **వాణిజ్య పన్నుల వసూళ్లలో లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలి. **-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 11/11/2026
WhatsApp Image 2026-11-11 at 5.33.32 PM

జిల్లాలో వివిధ రంగాల నుండి రావలసిన వాణిజ్య పన్నులను వేగవంతంగా వసూలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

​పశ్చిమ గోదావరి జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంపు, జీఎస్టీ నిబంధనల అమలు, వివిధ శాఖల సమన్వయంపై బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
అక్టోబర్ 2026 లో పశ్చిమ గోదావరి జిల్లాలో జీఎస్టీ వసూళ్లు రూ. 22.65 కోట్లుగా నమోదు కాగా, గత ఏడాది అక్టోబర్ మాసంలో రూ. 22.12 కోట్లు అయ్యాయని, దీనితో పోలిస్తే 2.40 శాతం వృద్ధి సాధించబడిందన్నారు. అక్టోబర్ 2026 వరకు సేకరించిన మొత్తం జీఎస్టీ వసూళ్లు 3.90 శాతం పెరిగి రూ. 147.46 కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు.
అక్టోబర్ 2026లో వృత్తి పన్ను వసూళ్లు రూ. 0.55 కోట్లు కాగా, గత ఏడాది అక్టోబర్ రూ. 0.47 కోట్లు తో పోలిస్తే 15.83 శాతం వృద్ధిని సాధించిందన్నారు. అక్టోబర్ 2026 నాటికి సేకరించిన మొత్తం వృత్తి పన్ను గత ఏడాది ఇదే కాలంలోని రూ. 4.53 కోట్లతో పోలిస్తే 11.24 శాతం పెరిగి రూ. 5.04 కోట్లకు చేరుకుందన్నారు. ​ భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు సర్కిళ్ల వారీగా
జీఎస్టీ, వృత్తి పన్ను వసూళ్లు, వాటి వృద్ధి శాతాలను ఈ సమావేశంలో సమీక్షించడం జరిగింది. ​శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడానికి, రాబడి వృద్ధిని సాధించడానికి, నిబంధనల అమలును పర్యవేక్షణಲು ఈ నెలవారీ సమావేశాలు ఎంతగానో దోహదపడుతున్నాయని సమావేశంలో పేర్కొన్నారు. ​జీఎస్టీ టీడీఎస్ డిడెక్టర్లుగా నమోదైన కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు నిల్ రిటర్న్‌లతో సహా నెలవారీ GSTR-7 రిటర్న్‌లను క్రమం తప్పకుండా దాఖలు చేయట్లేదని గుర్తించడం జరిగిందన్నారు.
​2026-27 ఆర్థిక సంవత్సరంలో నూరు శాతం నిబంధనల అమలును నిర్ధారించడానికి టెండర్ దశలోనే TDS నిబంధనలను చేర్చాలని, అర్హులైన డిడిఓ లు అందరూ సకాలంలో రిటర్న్‌లు దాఖలు చేసేలా చూడాలని తెలిపారు. ​ఏప్రిల్ నుండి అక్టోబర్ 2026 వరకు రిజిస్టర్డ్ ప్రభుత్వ కార్యాలయాలు 274 నమోదు కాగా, అక్టోబర్ నెలలో రిటర్న్‌లు దాఖలు చేయనివారి కార్యాలయాలు 258 ఉన్నాయని అధికారులు తెలిపారు. రిటర్న్‌లు దాఖలు చేయనివారిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ​ మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లలో జీఎస్టీ కంప్లైయన్స్ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
​కొనసాగుతున్న, రాబోయే ప్రధాన ప్రాజెక్ట్‌ల వివరాలను వాణిజ్య పన్నుల అధికారులకు తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర జీఎస్టీ, వ్యాట్ రాబడిని పరిరక్షించడానికి స్థానికంగానే నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేసేలా టెండర్ పత్రాలలో షరతులు చేర్చాలని తెలిపారు. ​రూ. 1 కోటికి పైగా బకాయిలు ఉన్న టాప్ 50 మంది డిఫాల్టర్ల చరా, స్థిరాస్తులను గుర్తించి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖల సహకారంతో బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని తెలిపారు.​ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఇ.సి ), ఆస్తుల బదిలీల నిరోధంలో సబ్-జిస్ట్రార్ల సహాయం తీసుకోవాలని తెలిపారు.
​ఏప్రిల్ నుండి అక్టోబర్ 2026 వరకు జిల్లాలో మొత్తం రూ. 258.82 లక్షల పన్ను బకాయిలు వసూలు చేయబడ్డాయన్నారు. వీటిలో జీఎస్టీ కింద రూ. 198.62 లక్షలు, సబ్స్యూమ్డ్ చట్టాల కింద రూ. 60.20 లక్షలు ఉన్నాయన్నారు.
​ప్రైవేట్ పాఠశాలల సమాచారంతో సహా వివిధ ఏజెన్సీల ద్వారా ఏప్రిల్ – అక్టోబర్ 2026 మధ్య కాలంలో 347 కొత్త వృత్తి పన్ను రిజిస్ట్రేషన్లు జారీ చేయబడ్డాయన్నారు. వీటిలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి నిపుణులను గుర్తించి రిజిస్ట్రేషన్లు పెంపొందించాలని విద్యా, మున్సిపల్ శాఖలకు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి.నాగార్జున రావు, డిప్యూటీ కమిషనర్ కె.పి. శైలజ శ్రీ, సహాయ కమిషనర్లు డి.సాంబశివరావు, కె.వి. శ్రీనివాస్, డి ఆర్ ఓ పి. గ్లోరీ, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.