పంట నష్టాల నమోదు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్
Publish Date : 12/11/2026
తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, మద్దతు ధర పొందేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాల్లో పంట నష్టం అంచనా వేసి నమోదు చేస్తున్న ప్రక్రియను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. పంట నష్టాల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా నమోదు చేయాలని, అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.