తాడేరు గ్రామంలో అనుమతులు లేని లేఅవుట్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్

Publish Date : 13/11/2026
WhatsApp Image 2026-11-13 at 7.25.51 PM

భీమవరం మండలం తాడేరు గ్రామంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లేఅవుట్ల నమూనాలు, ప్లాట్ల విభజన విధానం, స్థలాల అమరిక తదితర అంశాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. లేఅవుట్లకు సంబంధించి పొందిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనల మేరకు స్థల విభజన జరిగిందా లేదా అనే అంశాలను పరిశీలించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, సంబంధిత శాఖల అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని, ఇటువంటి లేఅవుట్ల విషయంలో అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా స్థలాలు కొనుగోలు చేసే ముందు లేఅవుట్లకు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.
అనుమతులు లేని లేఅవుట్లపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.