శిక్షణలో పొందిన అవగాహనను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరీ సంబంధిత అధికారులకు తెలిపారు.

Publish Date : 14/11/2026
WhatsApp Image 2026-11-14 at 5.18.46 PM

శిక్షణలో పొందిన అవగాహనను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరీ సంబంధిత అధికారులకు తెలిపారు.

శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో భారత జనగణన–2027కు సంబంధించి రెండో దశ జనాభా గణన నిర్వహణపై జిల్లా, చార్జ్ స్థాయి అధికారుల రెండవ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, అధికారుల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ అందించారు.

నేటి శిక్షణా కార్యక్రమం – సి.యం.యం.ఎస్
మరియు హెచ్. ఎల్. బి మ్యాపింగ్.

జనగణన–2027 రెండో దశలో భాగంగా, నేడు సి.యం.యం.ఎస్
మరియు హెచ్. ఎల్. బి మ్యాపింగ్ (హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాపింగ్) ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జనాభా గణన దశకు సంబంధించి, ఇప్పటికే ఉన్న హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను, ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా మార్చే విధానంపై ఈ శిక్షణలో వివరించారు.
ఈ సందర్భంగా సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. అనంతరం సి.యం.యం.ఎస్
పోర్టల్‌ను ప్రత్యక్షంగా ప్రదర్శించి, అందులో అందుబాటులో ఉన్న వివిధ సదుపాయాలు, వాటి వినియోగ విధానాలను వివరించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జనగణన కోఆర్డినేటర్ డాక్టర్ జగన్నాథ్ మాజీ, జిల్లా జన గణన అధికారి బి. భాగ్యప్ప, మాస్టర్ ట్రైనర్ లు ఏ. కృష్ణవేణి, సోను యాదవ్,
డ్వామా పిడి డాక్టర్ కె. సి హెచ్. అప్పారావు, తాడేపల్లిగూడెం ఆర్డీఓ, జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.