జనగణన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Publish Date : 16/11/2026
WhatsApp Image 2026-11-16 at 4.40.39 PM

క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సమర్థవంతమైన శిక్షణ అందించాలి
జనగణన–2027 రెండో విడతకు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నవంబరు 16 నుంచి 18వ తేదీ వరకు, అలాగే నవంబరు 19 నుంచి 21వ తేదీ వరకు రెండు బ్యాచ్‌లుగా నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తెలిపారు.

సోమవారం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన జనగణన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణన విధివిధానాలపై ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ అందించేందుకు కేంద్రం నుంచి జనగణన జాయింట్ డైరెక్టర్లు జగన్నాథ్ మాజీ, మోహిత్ పాల్గొన్నారని తెలిపారు. శిక్షణలో భాగంగా జనగణన ప్రక్రియ, సమాచార సేకరణ విధానం, పాటించాల్సిన నిబంధనలు తదితర అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు తమకు కేటాయించిన మండలాలు, మున్సిపాలిటీలకు వెళ్లి అక్కడ పనిచేసే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సమర్థవంతమైన శిక్షణ అందించాలని ఆదేశించారు. జనగణనలో ప్రతి ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం తదితర అంశాలను ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా నమోదు చేసేలా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు అవగాహన కల్పించాలన్నారు.
ఫీల్డ్ ట్రైనర్లు ముందుగా శిక్షణలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి సందేహాలు లేకుండా వివరించాలని సూచించారు. మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారానే జనగణన వివరాలను ఖచ్చితంగా సేకరించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, డి వై ఎస్ ఓ టి. సోమరాజు, కో ఆర్డినేషన్ సెక్షన్, సూపరింటెండెంట్
హెచ్ ఎన్ సి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.,ఫీల్డ్ ట్రైనర్స్ పాల్గొన్నారు