32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు విజయవంతం

Publish Date : 20/11/2026
WhatsApp Image 2026-11-20 at 4.25.44 PM

విద్యార్థులు పరిశోధనారంగం పై దృష్టి పెట్టి భావిశాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ అభ్యున్నతికి పాటుపడాలి అని జిల్లా సైన్స్ అధికారి మల్లుల శ్రీనివాస్ పిలుపునివ్వడమైనది. స్థానిక చింతలపాటి బాపిరాజు మెమోరియల్ హై స్కూల్, భీమవరం నందు ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (APCOST) మరియు విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2026 జిల్లాస్థాయి ప్రాజెక్ట్ పోటీలు ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమములో జరిగిన ప్రాజెక్టుల పోటీలలో జిల్లా నలుమూలల ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు 105 మంది స్థానిక సమస్యలపై పరిశోధనా పద్ధతిలో పరిష్కార మార్గాలు కనుగొని తమ తమ ప్రాజెక్టులు వివరించడమైనది. సుస్థిరత కోసం విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు అనే ప్రధాన అంశంగా గత మూడు నెలల నుండి చేస్తున్న పరిశోధన ప్రాజెక్టులకు డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, మేజర్,డాక్టర్ ఏ.వీరయ్య, డాక్టర్ వి.వాణిశ్రీ, డాక్టర్ ఎం. సీతారామరెడ్డి, డాక్టర్ ఆర్.మృత్యుంజయరావు గార్లు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. జిల్లా సైన్స్ అధికారి మరియు సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త మల్లుల శ్రీనివాస్, జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ చీలి రాజు, మాజీ అకడమిక్ కోఆర్డినేటర్ ఎం.వి.భాస్కరరావు, రిసోర్స్ పర్సన్స్ జి.సుకుమార్, టి.సతీష్ కుమార్, పర్సనల్ ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, డిఎన్ఆర్ కాలేజీ కరస్పాండెంట్ & సెక్రెటరీ కె.రామకృష్ణంరాజు గారి చేతుల మీదుగా విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు సైన్స్ పుస్తకాలు బహుకరించడమైనది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి విజేతలుగా నిలిచిన ఈ ఏడుగురు విద్యార్థులు డిసెంబర్లో అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలలో పాల్గొంటారు.
విజేతలు:
1. పి.వాగ్దేవి, జడ్పీహెచ్ఎస్, కోపల్లె
2. డి.జె.షణ్ముఖ, పోస్ట్ బేసిక్ స్కూల్, పెంటపాడు
3. వి.దిలీప్ కుమార్, బి.ఆర్.ఎం.వి. హై స్కూల్, పాలకొల్లు
4. డి. రామ్ చరణ్, పిఎంసి జడ్పీ బాయ్స్ హై స్కూల్, తణుకు
5. ఆర్. రోషిణి నాగ గౌరి, ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, నరసాపురం
6. వి.మనోజ్ వర్మ, జడ్పీహెచ్ఎస్, దొంగపిండి
7. వి.ప్రీతి, అభ్యాస్ ద గ్లోబల్ స్కూల్, పెదమిరం