పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నిక.
*జిల్లా పరిషత్ ఉప చైర్మన్‌గా సిరగాని నాగేశ్వరరావు ఎన్నిక.
**జిల్లా పరిషత్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ.
**పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ఉప చైర్మన్‌గా సిరగాని నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యులతో శుక్రవారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి
ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధ్యక్షత వహించి ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.
**జిల్లా పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారం
సమావేశం ప్రారంభంలో నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యులందరితో
ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో, ప్రజాసేవే లక్ష్యంగా నిర్వహిస్తామని ప్రమాణం చేశారు.
**చైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నిక.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా, చైర్మన్ పదవికి ఇందుకూరి రామకృష్ణంరాజు పేరును సభ్యులు ప్రతిపాదించి, ఇతర సభ్యులు బలపరిచారు. ఈ పదవికి మరే ఇతర నామినేషన్ లేకపోవడంతో ఇందుకూరి రామకృష్ణంరాజు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజుతో ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
**ఉప చైర్మన్‌గా సిరగాని నాగేశ్వరరావు ఎన్నిక.
జిల్లా పరిషత్ ఉప చైర్మన్ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో సిరగాని నాగేశ్వరరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించి, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, ఉప చైర్మన్‌లకు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
**నూతన చైర్మన్‌కు ప్రజాప్రతినిధుల అభినందనలు.
జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన ఇందుకూరి రామకృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. నాగరాజు, పలువురు జిల్లా పరిషత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, ఉప చైర్మన్‌లు మాట్లాడుతూ జిల్లా పరిషత్ అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతికి, ప్రజల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు నవ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమణ, జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………
జిల్లా సమాచార శాఖ, భీమవరం వారిచే జారీ.
గమనిక :- జడ్ పిటిసి సభ్యుల పేర్లు, స్థానం, పార్టీ వివరాలు వరుసగా:-
1. శ్రీమతి అడ్డాల శ్రీసత్య – నరసాపురం – జనసేన పార్టీ
2. శ్రీమతి కత్తుల సిరి మహాలక్ష్మీ – భీమవరం – జనసేన పార్టీ
3. శ్రీమతి కొడవటి నాగలక్షి – యలమంచిలి – జనసేన పార్టీ
4. శ్రీ చలుమూరి చంద్రశేఖర్ – పెనుగొండ – తెలుగుదేశం పార్టీ
5. శ్రీమతి చింతపల్లి వెంకట దుర్గ – వీరవాసరం – తెలుగుదేశం పార్టీ
6. శ్రీ చింతలపాటి శివనాగరాజు – పాలకోడేరు – తెలుగుదేశం పార్టీ
7. శ్రీ తనబుద్ధి రవి కిరణ్ – పెంటపాడు – జనసేన పార్టీ
8. శ్రీమతి దాసరి మిస్సమ్మ – పోడూరు – తెలుగుదేశం పార్టీ
9. శ్రీ నేకూరి కిరణ్ కుమార్ – తాడేపల్లిగూడెం – తెలుగుదేశం పార్టీ
10. శ్రీమతి నౌకట్ల వెంకటలక్ష్మి – ఆకివీడు – తెలుగుదేశం పార్టీ
11. శ్రీమతి పంపన మహాలక్ష్మి – ఇరగవరం – భారతీయ జనతా పార్టీ
12. శ్రీ పెన్మెత్స వెంకట లక్ష్మి నరసింహరాజు – ఉండి – జనసేన పార్టీ
13. శ్రీ బీరా నరసింహమూర్తి – ఆచంట – తెలుగుదేశం పార్టీ
14. శ్రీ మట్టా వెంకటేశ్వర రావు – తణుకు – తెలుగుదేశం పార్టీ
15. శ్రీమతి మేకా గీతా మహాలక్ష్మి – కాళ్ళ – జనసేన పార్టీ
16. శ్రీమతి మేడిది ఉషారాణి – పాలకొల్లు – తెలుగుదేశం పార్టీ
17. శ్రీ యిందుకూరి రామ కృష్ణం రాజు – గణపవరం – తెలుగుదేశం పార్టీ
18. శ్రీమతి లోకం నాగలక్ష్మి – మొగల్తూరు – తెలుగుదేశం పార్టీ
19. శ్రీ వెలగల బుల్లి రామిరెడ్డి – పెనుమంట్ర – తెలుగుదేశం పార్టీ
20.శ్రీ శిరగాని నాగేశ్వర రావు – అత్తిలి – తెలుగుదేశం పార్టీ