మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పరిశీలించిన ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Publish Date : 22/11/2026
ఆదివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది కేటాయింపునకు చేపట్టిన ర్యాండమైజేషన్ ప్రక్రియను ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఎన్నికల విధులకు సిబ్బందిని పారదర్శకంగా, నిబంధనల ప్రకారం కేటాయించాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.