నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ

Publish Date : 23/11/2026
WhatsApp Image 2026-11-23 at 6.52.25 PM

వీరవాసరం మండలం నౌడూరు గ్రామంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సోమవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకలను కచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ స్వీకరణ పత్రిను నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు కావు లేకుండా ప్రతి అంశమును పారదర్శకత పాటిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె .ప్రవీణ్ కుమార్ రెడ్డి, తాహసిల్దార్ బి. కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు