మిల్లర్ల నుంచి సేకరించిన గోనె సంచులను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేయాలి.
జిల్లాలో ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలు సేకరణ, గోనె సంచుల పంపిణీ పై అవగాహన కార్యక్రమం.
* ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె ఆర్ కల్ప శ్రీ
భీమవరం, 23 నవంబర్, 2026.
ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మిల్లర్ల నుంచి సేకరించిన గోనె సంచులను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పేర్కొన్నారు.
సోమవారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం లో గోనె సంచుల సేకరణ, రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ విధానం, యాప్లో వివరాల నమోదు, డేటా అప్లోడ్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై డేటా ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోనె సంచుల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఖరీఫ్ సీజన్ 2026-27 లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రారంభించడం జరిగిందని, ఇందుకు అవసరమైన గోనెసంచు లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు అవసరమైన గోనె సంచులను సకాలంలో అందుబాటులో ఉంచడం అత్యంత ముఖ్యమన్నారు. మిల్లర్ల నుంచి సేకరించిన గోనె సంచులను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందజేసే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
**యాప్లో వివరాల నమోదు తప్పనిసరి
గోనె సంచుల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను డేటా ఆపరేటర్లు నిర్దేశించిన యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు. గోనె సంచుల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా ప్రతి దశకు సంబంధించిన వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు పంపిణీ చేసిన గోనె సంచుల సంఖ్య, పంపిణీ వివరాలు తదితర సమాచారాన్ని సంబంధిత డేటా ఆపరేటర్లు యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. డేటా ఆపరేటర్లు యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరిగిన పంపిణీకి, యాప్లో నమోదు చేసిన వివరాలకు మధ్య వ్యత్యాసం లేకుండా చూసుకోవాలన్నారు.
పంపిణీ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ
మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణ, రైతు సేవా కేంద్రాలకు వాటి తరలింపు, రైతులకు పంపిణీ వంటి ప్రతి దశను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గోనె సంచుల నిల్వలు, పంపిణీ వివరాలకు సంబంధించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు.
రైతులకు గోనె సంచులు అందించడంలో ఎటువంటి జాప్యం జరగకుండా రైతు సేవా కేంద్రాల సిబ్బంది, మిల్లర్లు, డేటా ఆపరేటర్లు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
రైతులు ధాన్యం విక్రయించే సమయంలో అవసరమైన గోనె సంచులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా యం.ఎల్.ఒ లే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జిల్లాలో అన్ని ధాన్యం కేంద్రాలను రైతులు సౌకర్యార్థం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. మిల్లర్లు గొనె సంచులను సరఫరా చేయు టకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ధాన్యం కొనుగోలు సమయంలో అధికారులు జాగ్రత్త వహించాలని, మిల్లు వద్ద ఉన్న వాహనాలకు ట్రక్ షీట్ లు జనరేట్ చేయవద్దని తెలిపారు. రైతు సేవ కేంద్రాల వద్ద ఉన్న వాహనాలకు మాత్రమే ట్రక్ సీట్లు జనరేట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న క్విక్ టీములను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8121676653 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు.
అవగాహన కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఇబ్రహీం, జిల్లా కో ఆపరేటివ్ అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు, తదితరులు పాల్గొన్నారు.