జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మనసు పెట్టి శ్రద్ధగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అధికారులను ఆదేశించారు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మనసు పెట్టి శ్రద్ధగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అధికారులను ఆదేశించారు
కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి, తో కలసి జిల్లాలో ఆర్ డి ఓ లు, డి ఎస్ పి లు మున్సిపల్ కమిషనర్లు, తాహసిల్దార్లు,ఎంపిడిఓ లు, పోలీసు అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్ , గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనున్న సందర్భంగా ,పశ్చిమగోదావరి జిల్లాలో మున్సిపల్, జడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ముందుగా సిద్ధం చేసుకొని, తనిఖీ చేసుకోవాలన్నారు. జిల్లాలో నరసాపురం, ఆకివీడు , మున్సిపాలిటీలు, పాటు జిల్లా లో జడ్పిటి సి, ఎంపిటిసి, ఎలక్షన్ జరుగుతాయి, జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటినుండి ఒక్కో ఎలక్షన్ కు 25 రోజులు వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుంది అన్నారు.పోలింగ్ కేంద్రాలను ఎంపిడిఓ, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అనే విషయాన్నీ చూడాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటె ఎన్నికల అధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలన్నారు. ఎన్నికల మార్గదర్శకాలు గురించి త్వరగా అర్థం చేసుకునేలా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాలు రూట్స్ మ్యాప్ లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ నిర్వహించడం లో చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.పోలింగ్, కౌంటింగ్, పోలింగ్ సామాగ్రి, నిల్వ, పంపిణీ కేంద్రాలలో కాంపౌండ్ వాల్, విద్యుత్, ఇంటర్నెట్ , భద్రత ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
***జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మాట్లాడుతూ ఎన్నికల ప్రవక్త నియమావళి లో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎన్నికలు నిర్వహణకు భద్రత ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో భద్రతను మరింత పెంచుతామన్నారు. పోలింగ్ కేంద్రాలు పటిష్టంగా ఉండాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె. ఆర్ కల్పశ్రీ,,అడిషనల్ ఎస్పీ విశ్వనాధ్ ,జిల్లా పంచాయతీ అధికారి, వై దోసిరెడ్డి, ఆర్డీవోలు, డిఎస్పీ లు,మున్సిపల్ కమిషనర్లు, తాహసిల్దార్లు,ఎంపిడిఓ లు, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.