స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పై మార్గదర్శకాలు జారి…పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి. ఆర్. కృష్ణ తేజ
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పై మార్గదర్శకాలు జారి…పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి. ఆర్. కృష్ణ తేజ
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి. ఆర్. కృష్ణ తేజ అధికారులకు సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆదివారం తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి (ఎఫ్ఏసీ), జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి వై. దోసి రెడ్డి, భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాసి రాజు, నరసాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రవీణ్ కుమార్, నూతనంగా నియమితులైన జిల్లా పంచాయతీ అధికారి పి. విజయ భాస్కర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి. రమణ, జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసే విధానం, అనుసరించాల్సిన నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ, రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత రికార్డులు, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
రిజర్వేషన్ల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతోపాటు, సంబంధిత అధికారులు పరస్పర సమన్వ యంతో పనిచేయా లని, అవసరమైన సమాచారాన్ని సేకరించి ధ్రువీక రించాలని తెలి పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటి స్తూ, ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను సజావు గా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు బాధ్యతాయుతంగా చర్యలు తీసుకో వాలని సూచించా రు.