సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

Publish Date : 12/10/2026

క్యూ ఆర్ కోడ్ పి జి ఆర్ ఎస్ సేవలపై ప్రజలలో విస్తృత అవగాహన వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి. గ్లోరియా, కలెక్టరేట్ కె ఆర్ ఆర్ సి. డిప్యూటీ కలెక్టర్ బి పి ప్రభాకర రావు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై. దోసి రెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, ప్రజల నుండి 81 పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులు 26 రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ,
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పిజిఆర్ఎస్ లో స్వీకరించిన ప్రతి అర్జీని
జవాబుదారితనంతో పరిష్కరించాలి అన్నారు . ప్రజలకు మరింత సేవలను అందించాలని, పి జి ఆర్ ఎస్ సేవలను క్యూ ఆర్ కోడ్ ద్వారా వినియోగించుకోవడం వల్ల ప్రజలకు మరింత సులభతరంగా మారుతుందని, ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించి ప్రజా సమస్యలు పరిష్కరించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ అర్జీలు పరిష్కరించడం లో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి, ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
రెవిన్యూ, పంచాయతీరాజ్,సర్వే, మున్సిపల్, ఎండోమెంట్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఫిషరీస్ , ఎడ్యుకేషన్, ఇరిగేషన్, తదితర శాఖలు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ఐ-గాట్ కర్మయోగి పోర్టులో ఆయా శాఖల అధికారులు సిబ్బంది శిక్షణ కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేసి పోర్టర్లో పురోగతిని మెరుగు పరచాలని అన్నారు , అక్షరాంధ్ర క్లాసులు నిర్వహణలో హాజరు శాతం పెంచాలని సంబంధిత జిల్లా అధికారులతో పాటు డివిజన్ మండల స్థాయి అధికారులను వర్చువల్ గా ఆదేశించారు.
2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి అదనపు బోధన, పునశ్చరణ తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని సూచించారు.

పి జి ఆర్ ఎస్ లో స్వీకరించిన కొన్ని ఫిర్యాదులు

***వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామం నుండి జవ్వాది ఝాన్సీ వరలక్ష్మి, తన 60 సెంట్లు భూమి, మరియు అలివేలు మంగతాయారు 1.40 సెంట్లు మొత్తం 2.50 ఎకరాలకు గాను ఉమ్మడి ఎల్ పి ఎం లో1.47 సెంట్లు భూమిగా నమోదు అయినది. సరిచేసి ఇద్దరు పేరున విడి విడిగా చూపించాలని కోరారు.
***పాలకోడేరు మండలం శృంగవృక్షం జంగంపేట నుండి తాళ్ల పెద్దిరాజు వృద్ధాప్యంలో ఉన్న తన స్థలమును సరిహద్దు స్థలం చెందిన చోడ దాసి సూర్యారావు, ఆక్రమించుకుని బాత్ రూమ్ నిర్మించుకున్నారు. అడుగుగా దౌర్జన్యం చేస్తున్నాడు చర్యలు తీసుకుని తన స్థలం తనకు ఇప్పించాలని కోరారు.
***పెనుగొండ గ్రామం నుండి వరం శెట్టి పాండురంగారావు సిద్ధాంతంలో సర్వే నెంబరు 335-2 నందు 50 సెంట్లు జిరాయితీ భూమి సంబంధించి రిజిస్ట్రేషన్ కొరకు వెళ్లగా గజా లో భూమి ఉంది రిజిస్ట్రేషన్ గజాలలో చెయ్యాలి అని రిజిస్ట్రేషన్ అధికారులు మాకు అంటున్నారు. తన భూమి వరి పంటగా ఉన్నందున జిరాయితీ భూమిగా మార్పు చేయాలని కోరారు.

***ఆకివీడు మండలం కోళ్ల పర్రు గ్రామం నుండి నాoగడ్డ రాముడు గ్రామపంచాయతీలో పని చేస్తున్న తనకు ఇవ్వవలసిన జీతం నిలుపుదల చేసి గ్రామ కార్యదర్శి ఇబ్బందులు పెడుతున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
* గణపవరం మండలం మొయ్యరు గ్రామం నుండి ఈద వెంకటలక్ష్మి 2019 సంవత్సరంలో ప్రభుత్వం వారు తనకు ఇండ్ల స్థలము కేటాయించగా వేరే వారు ఆక్రమించుకొని తనపై దౌర్జన్యం చేస్తున్నారని తన స్థలం తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు వయోవృద్ధుల ట్రిబునల్ కమిటీ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.