లింగ ఎంపికను అరికట్టండి ఆడపిల్లను కాపాడండి లఘు చిత్రాల పోటీల విజేతలకు బహుమతుల అందజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
లింగ ఎంపికను అరికట్టండి ఆడపిల్లను కాపాడండి లఘు చిత్రాల పోటీల విజేతలకు బహుమతుల అందజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పిసి అండ్ పి ఎన్ డి టి చట్టంపై అవగాహన కల్పిస్తూ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ ఎంపికను అరికట్టండి ఆడపిల్లను కాపాడండి అనే అంశంపై జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల (షార్ట్ ఫిలిం) పోటీల విజేతలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో
తణుకు ఎస్.సి.ఐ.ఎమ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నోడల్/ఐడి కళాశాల సౌజన్యంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ముగ్గురు నిపుణులతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం వచ్చి 8 లఘు చిత్రాలను సమగ్రంగా పరిశీలించి ఫలితాలను వెల్లడించ గా సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో
పోటీల లో విజేతలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
ప్రథమ బహుమతి రూ. 30, వేలు ఎన్. ఉమాదేవి మూడవ సంవత్సరం బి ఎస్ ఎస్ సి టీం కు, తాడేపల్లిగూడెం డి.ఆర్.జి. ప్రభుత్వ కళాశాల,
ద్వితీయ బహుమతి రూ. 20 వేలు బి. ప్రవల్లిక రెండవ సంవత్సరం బి ఎస్ సీ టీమ్, తణుకు ఎస్.సి.ఐ.ఎమ్. ప్రభుత్వ కళాశాల ఎ ,
తృతీయ బహుమతి రూ. 10, వేలు పి. మౌనిక మూడవ సంవత్సరం బి ఎస్ సి టీమ్, గెలుపొందడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రవిబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఈ ఎం ఓ రాజా హక్కులు,కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు