ఆరు దశాబ్దాలుగా సెక్షన్ 22 A నిషేధిత భూములు సమస్యను పరిష్కరించినందుకు పడాల శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మరియు జిల్లా కలె క్టర్ చదలవాడ నాగరాణి
ఆరు దశాబ్దాలుగా సెక్షన్ 22 A నిషేధిత భూములు సమస్యను పరిష్కరించినందుకు పడాల శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మరియు జిల్లా కలె క్టర్ చదలవాడ నాగరాణి లను అభినందించారు. మంగళవారం స్థానిక పడాల శ్రీరామ్ నగర్ లో నిర్వహించిన పట్టా భూముల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని శాసనసభ్యులు అన్నారు. అనాదిగా అపరిష్కృతంగా ఉన్న పడాల గ్రామ ప్రజల పట్టాల పంపిణీ సమస్యను పరిష్కరించిన రెవిన్యూ అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. ముఖ్యంగా భూ సమస్యలు పరిష్కరించడంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ కల్ప శ్రీ త్వరితగతి నభూమి పట్టాలు పంపిణీకు కృషి చేశారని శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో పేద ప్రజలు సమస్యలను పి జి ఆర్ ఎస్ లో పరిష్కరించడంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. జిల్లాలో పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను కృషి చేయడం జరుగుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. పడాల గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని, అంగన్వాడి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా శాసనసభ్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ సెక్షన్ 22a కింద హక్కులు లేని భూమిని వినియోగించుకునే విధానం తెలియక ప్రజలు సతమతమయ్యే వారని , భూ సమస్యలు, పట్టాలు పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యలు పరిష్కరించేందుకు రెవిన్యూయంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భూ సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాకు తెలియజేయడం జరిగిందని ఆమె అన్నారు. పడాల శ్రీరామ్ నగర్ లో 79 మంది 22 సెక్షన్ A లో పరిష్కరించవలసి ఉండగా 39 మందికి భూపట్టాలు పంపిణీ చేయడం జరిగిందని అని చెప్పారు. దర్శిపరు పెంటపాడు , దండ గర్ర గ్రామాల్లో 22 ఏ రెవిన్యూ పరమైన ఇబ్బందులు ప్రయారిటీ బేసిస్ లో పరిష్కరించేందుకు కృషి చేయాలని రెవిన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కల్ప శ్రీ మాట్లాడుతూ చట్టపరమైన అంశాల దృష్టిలో ఉంచుకుని భూ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుంది జాయింట్ కలెక్టర్ కల్ప శ్రీ అన్నారు. అనంతరం 39 మందికి పట్టా భూములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యారావు, బిజెపి నాయకులు నరిసే సోమేశ్వరరావు, ఏం సి డైరెక్టర్ మల్లేశ్వరరావు, వర్తనపల్లి కాశి, సాల్మన్ రాజు కొల్లి సూరి ప్రకాష్ వాడపల్లి సుబ్బరాజు, రాజేంద్రప్రసాద్ కొనగల హరినాథ్ ఉప్పల కృష్ణ, టిడిపి, బిజెపి, జనసేన కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటో క్యాప్షన్. మంగళవారం పడాల శ్రీరామ్ నగర్ లో భూమి పట్టాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్ట నిర్వహించినర్ కల్పశ్రీ, ఆర్డిఓ సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.——–జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం భీమవరం నుండి జారీ చేయడ మైనది.