ప్రభుత్వ భూములు ఆక్రమణ పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ప్రభుత్వ భూములు ఆక్రమణ పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణ లకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశం నందు రెవిన్యూ, ఇరిగేషన్, డ్రైన్స్, మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ, అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే తక్షణ చర్యలు తీసుకుని, తొలగించాలని అన్నారు.
గతంలో ఆక్రమణలు తొలగించి నప్పటికీ, ఆక్రమణలకు, గురైతే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటే ఊరుకునేది లేదని అట్టి వారిపై చర్యలు తప్పవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణల పట్ల నిర్లక్ష్యంగా వహించే అధికారుల పై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో దాసిరాజు,మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డా డి. శ్రీనివాస్, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి, తాహసిల్దార్ షేక్ మహమ్మద్ ఫరూక్, కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్, అప్పారావు, ఇరిగేషన్, ట్ డ్రైన్స్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.