పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా ఏం . రవిబాబు ఎండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు దుర్గాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆస్పత్రుల్లోని రికార్డులను, రోగులకు అందుతున్న వైద్య సేవలను లోతుగా

Publish Date : 15/10/2026
WhatsApp Image 2026-10-15 at 5.03.06 PM

పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా ఏం . రవిబాబు ఎండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు దుర్గాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆస్పత్రుల్లోని రికార్డులను, రోగులకు అందుతున్న వైద్య సేవలను లోతుగా పరిశీలించి, వైద్య అధికారులు మరియు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాన ఆదేశాలు & సూచనలు:
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు:
వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులందరూ తప్పనిసరిగా FRS యాప్ ద్వారానే సమయపాలన పాటిస్తూ హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఔట్ పేషెంట్ (OP) సేవలు:
ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా OP సేవలను మెరుగ్గా అందించాలని సూచించారు. అవసరమైన ఉచిత మందులు, లాబ్ పరీక్షలు సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
మాతా శిశు సంరక్షణ (MCH) కార్యక్రమాలు:
గర్భిణులు, బాలింతలు మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా ANCs నమోదు, టీకాలు మరియు పోషకాహార లోపాలు లేకుండా అవగాహన కల్పించాలని సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు.