2026-27ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి నవంబరు 5వ తేదీ నాటికి తాడేపల్లిగూడెం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి
2026-27ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
నవంబరు 5వ తేదీ నాటికి తాడేపల్లిగూడెం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
2026-27 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పొక్యూర్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సంబంధించి
ప్రతి రైతు సేవా కేంద్రంలో అవసరమైన గోనె సంచులను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచుల్లో కనీసం 50 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ధాన్యం రవాణా కు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, రవాణా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం తూకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా తూకపు యంత్రాలను తనిఖీ చేసి, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించి ముద్రలు వేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిబంధనల ప్రకారం రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని స్పష్టం చేశారు.
రైతులకు ధాన్యం కొనుగోలు విధానం, నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం, ధాన్యం విక్రయానికి అవసరమైన రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతుల వివరాల నమోదు, ధాన్యం నాణ్యత పరిశీలన, కొనుగోలు అనంతర ప్రక్రియలపై శిక్షణా తరగతులు నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌కు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి 2026-27 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి, రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎం సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి సునీత, జిల్లా కోపరేటి శాఖ అధికారి కె మురళీకృష్ణ , మార్కెటింగ్ శాఖ ఏడి సునీల్, లీగల్ మెట్రాలజీ శివబాలాజీ, ఏఎస్ఓస్ ఎం రవిశంకర్, ఏడి శ్రీనివాస్,ఎం వి ఐ ఎం డి జమీర్, తదితరులు పాల్గొన్నారు.