చేనేత రంగ అభివృద్ధి, నేతన్నల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి చేనేత జౌళి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
చేనేత రంగ అభివృద్ధి, నేతన్నల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
చేనేత జౌళి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
శనివారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో చేనేత రంగం అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, వారికి అందిస్తున్న ప్రభుత్వ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందుతున్న తీరుపై అధికారులతో చర్చించారు. చేనేత కార్మికుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, నేతన్నలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ కె అప్పారావు, డిప్యూటీ డైరెక్టర్ కె పెద్దిరాజు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.