ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, పారదర్శక పాలనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, పారదర్శక పాలనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పశ్చిమ గోదావరి జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ దేవాదాయ శాఖ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
జిల్లా ఎండోమెంట్ అధికారిగా నియమితులైన వి. వెంకటేశ్వరరావు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
వి. వెంకటేశ్వరరావు గతంలో కాకినాడ జిల్లాలో పనిచేస్తూ, అక్కడి నుంచి భీమవరం జిల్లా ఎండోమెంట్ అధికారిగా బదిలీపై వచ్చారు. ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా ఎండోమెంట్ అధికారిగా పనిచేసిన సూర్య ప్రకాష్, మావుళ్లమ్మ తల్లి ఆలయ కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆలయాల ఆస్తుల పరిరక్షణకు, పారదర్శకమైన పాలనకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.