మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

Publish Date : 19/10/2026
WhatsApp Image 2026-10-19 at 5.04.15 PM

నరసాపురం పురపాలక సంఘం పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, మరియు ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికలు , సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా, పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం నరసాపురంలోని స్థానిక వైన్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా కౌంటింగ్ గదిలో చేపడుతున్న ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన సదుపాయాలు, సిబ్బందికి కల్పించాల్సిన వసతులు, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు.
కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన టేబుళ్లు, కుర్చీలు, విద్యుత్ సదుపాయం, లైటింగ్, తాగునీరు తదితర మౌలిక వసతులు సమకూర్చాలని తెలిపారు.
ఓట్ల లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్న అధికారులు, సిబ్బంది, ఎన్నికల విధులకు సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రవేశించేలా తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశను క్రమబద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని తెలిపారు.
మున్సిపల్ , ఎంపీటీసీ, జెడ్పిటిసి,ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, డి ఎల్ డి వో ఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు.