పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా ఏం . రవిబాబు వీరవాసరం లోని పలు ప్రైవేటు వైద్య, నిర్ధారణ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా ఏం . రవిబాబు వీరవాసరం లోని పలు ప్రైవేటు వైద్య, నిర్ధారణ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా వీరవాసరం లోని డెంటల్ క్లినిక్లను సమగ్రంగా పరిశీలించారు.
తనిఖీల ముఖ్య అంశాలు:
* వైద్య కేంద్రాల రిజిస్ట్రేషన్ మరియు అనుమతి పత్రాల (Clinical Establishments Act) పరిశీలన.
* ల్యాబ్లు, క్లినిక్లలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది అర్హతలు, నిబంధనల పాటింపు.
* రోగులకు అందిస్తున్న సేవల నాణ్యత, స్వచ్ఛత మరియు సురక్షిత ప్రమాణాలు.
* ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రికార్డులు నిర్వహిస్తున్నారా లేదా అనే వివరాల తనిఖీ.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడిచే క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని, అన్ని రకాల అనుమతులు ఉన్న కేంద్రాలు మాత్రమే సేవలు అందించాలని స్పష్టం చేశారు. అర్హత కలిగిన టెక్నీషియన్లు, నిపుణుల సమక్షంలోనే పరీక్షలు మరియు చికిత్సలు జరగాలని ఆదేశించారు.