జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బి. నవ్య, ఐఏఎస్
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బి. నవ్య, ఐఏఎస్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు నియమితులైన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బి. నవ్య, ఐఏఎస్ శుక్రవారం జిల్లాలో పర్యటించి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతున్న కేంద్రాలను సందర్శించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బి. నవ్య, భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆమె ఛాంబర్లో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పురోగతి, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై చర్చించారు.