పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడు రోజులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 23/10/2026
WhatsApp Image 2026-10-23 at 6.13.48 PM

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి…: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడు రోజులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

శుక్రవారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ జరిగిందని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 392 నామినేషన్లు స్వీకరించినట్లు వెల్లడించారు. అలాగే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం వరకు 1,042 నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమణ, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.