పాలకొల్లులో ఈ నెల 25న జరగనున్న 10K రన్ కు సంబంధించిన టీ-షర్ట్లు, మెడల్స్ ఆవిష్కరించిన …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
పాలకొల్లులో ఈ నెల 25న జరగనున్న 10K రన్ కు సంబంధించిన టీ-షర్ట్లు, మెడల్స్ ఆవిష్కరించిన …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి….
ఆరోగ్యకరమైన సమాజ స్థాపనే ధ్యేయంగా “రన్ ఫర్ ఎ ఫిట్టర్ పాలకొల్లు” (Run for a Fitter Palakollu) అనే నినాదంతో వర్మ మెరైన్ ఆధ్వర్యంలో ఈ నెల అక్టోబర్ 25, 2026 ఆదివారం పాలకొల్లులో భారీ 10K రన్ నిర్వహించనున్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ రన్‌కు సంబంధించిన టీ-షర్ట్లు, మెడల్స్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల్లో శారీరక శ్రమ, ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచేందుకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ పరుగు పందెం పాలకొల్లులోని బ్రోడిపేట బైపాస్ రోడ్ నుండి ప్రారంభంకానుందని. ఇందులో మొత్తం మూడు విభాగాలలో పోటీలు జరగనున్నాయన్నారు.
* 3KM ఫన్ రన్ (Fun Run)
* 5KM టెంపుల్ టైమ్డ్ రన్ (Temple Timed Run)
* 10KM టైమ్డ్ రన్ (Timed Run)
ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు భారీగా నగదు బహుమతులు అందించనున్నారు. మొత్తం ఈవెంట్ కోసం రూ. 1,72,000/- లంప్సమ్ ప్రైజ్ మనీని కేటాయించారు. 10 k రన్ లో దీనిని నాలుగు వయసు విభాగాల (25 ఏళ్ల లోపు, 26-40 ఏళ్లు, 41-55 ఏళ్లు, 55 ఏళ్లకు పైబడిన వారు) వారీగా పురుషులు మరియు మహిళలకు విడివిడిగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇస్తారు. మొదటి బహుమతి గరిష్టంగా రూ. 10,000 వరకు ఉంటుంది.
* 5K టెంపుల్ టైమ్డ్ రన్ లో అన్ని వయసుల వారికి (ఓపెన్ కేటగిరీ) నిర్వహించే ఈ రన్లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన పురుషులు మరియు మహిళలకు నగదు బహుమతులు ఉంటాయి. 5K రన్ బహుమతులు కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక పార్టిసిపెంట్లకు మాత్రమే వర్తిస్తాయి.
ఈ పరుగు పందెంలో పాలకొల్లు పరిసర ప్రాంతాల ప్రజలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు యు. ప్రసాద్, కె. సురేష్ కుమార్, సయ్యేష్, అశోక్ కిషోర్ మరియు గణేష్ తదితరులు పాల్గొన్నారు.