హెచ్ఐవీ,ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాల సాధనకు సమన్వయంతో కృషి చేయాలి హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 26/10/2026
WhatsApp Image 2026-10-26 at 4.47.08 PM

హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, వారిపై ఎలాంటి వివక్ష చూపకుండా అవసరమైన వైద్య సేవలు, సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
సోమవారం కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో హెచ్ఐవీ,ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలు పురోగతి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తుల పట్ల ఎవరూ వివక్ష చూపకూడదని, వారిని అవమానించేలా లేదా వారి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.
వారికి అవసరమైన వైద్య సేవలు, చికిత్స, ఆరోగ్య సలహాలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్ఐవీ,ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, అపోహలు మరియు వివక్షను తొలగించేందుకు కృషి చేయాలని తెలిపారు.
జిల్లాలో హెచ్ఐవీ,ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల వివరాలు, లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను జిల్లా సహయోగిగౌరి, కలెక్టర్‌కు వివరించారు.
95-95-95 లక్ష్యాలపై సమీక్ష
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యాలు హెచ్ఐవీ నియంత్రణలో కీలకమైనవని సమావేశంలో వివరించారు. ఈ లక్ష్యాల ముఖ్య ఉద్దేశం హెచ్ఐవీతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్య స్థితిపై అవగాహన కల్పించడం, అవసరమైన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించే స్థాయిలో వైరల్ లోడ్‌ను నియంత్రించడం.
మొదటి 95 శాతం లక్ష్యం: హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో కనీసం 95 శాతం మందికి తమ హెచ్ఐవీ స్థితి గురించి తెలిసి ఉండాలి. ఇందుకోసం హెచ్ఐవీ పరీక్షలపై అవగాహన పెంపొందించడం, అవసరమైన వారికి పరీక్షా సేవలను అందుబాటులో ఉంచడం ముఖ్యం.
రెండవ 95 శాతం లక్ష్యం: తమ హెచ్ఐవీ స్థితి తెలిసిన వారిలో కనీసం 95 శాతం మంది యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స పొందుతూ ఉండాలి. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సకాలంలో చికిత్స ప్రారంభించడం, మందులను క్రమం తప్పకుండా తీసుకునేలా ప్రోత్సహించడం ఈ లక్ష్యంలో భాగం.
మూడవ 95 శాతం లక్ష్యం: ఏ ఆర్ టి చికిత్స పొందుతున్న వారిలో కనీసం 95 శాతం మందిలో వైరల్ లోడ్ నియంత్రణలో ఉండాలి. ఇందుకోసం నిరంతర వైద్య పర్యవేక్షణ, మందుల క్రమబద్ధమైన వినియోగం, అవసరమైన వైరల్ లోడ్ పరీక్షలు కీలకం.
జిల్లాలో లక్ష్యాల సాధనకు మరింత కృషి చేయాలని
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి బాబు అన్నారు .జిల్లాలో హెచ్ఐవీ,ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల ప్రస్తుత స్థితిగతులను సమావేశంలో వివరించారు. జిల్లాలో ప్రస్తుతం మొదటి 95 లక్ష్యం 88 శాతం, రెండవ 95 లక్ష్యం 91.66 శాతం, మూడవ 95 లక్ష్యం 97.55 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
మూడవ లక్ష్యంలో నిర్దేశిత 95 శాతం లక్ష్యాన్ని జిల్లా అధిగమించగా, మొదటి, రెండవ లక్ష్యాల్లో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని సమీక్షలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హెచ్ఐవీ పరీక్షలపై అవగాహన పెంపొందించడం, హెచ్ఐవీ స్థితి తెలిసిన ప్రతి ఒక్కరికీ అవసరమైన ఏ ఆర్ టి చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా పర్యవేక్షించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని చర్చించారు.
మందుల వినియోగంపై ప్రత్యేక దృష్టి
ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ మందులు తీసుకుంటున్న వారి పరిస్థితి మెరుగుపడినట్లు అధికారులు వివరించారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ, చికిత్స మధ్యలో నిలిపివేయకుండా హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి నిరంతర వైద్య సేవలు అందించాలని సమావేశంలో చర్చించారు.
హెచ్ఐవీ నియంత్రణలో ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స, మందుల క్రమబద్ధమైన వినియోగం, వైద్యుల సూచనల మేరకు నిరంతర పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సంబంధిత వైద్య సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర భాగస్వామ్య విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ 95-95-95 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తుల పట్ల వివక్షకు తావులేదు
హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులకు వైద్య సేవలు అందించడంతో పాటు, సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవసరమైన సహకారం అందించడం కూడా ముఖ్యమని
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా హెచ్ఐవీ పాజిటివ్ నెట్‌వర్క్ అధ్యక్షులు కె. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.