తుఫాన్ నేపథ్యంలో ధాన్యం, పంటల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి గోనె సంచులు,కార్మికులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి

Publish Date : 26/10/2026
WhatsApp Image 2026-10-26 at 6.54.20 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా లో రైతులు తమ పంటలు, కోతలు పూర్తయిన ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరుచుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుండి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు.
తుఫాన్ దృష్ట్యా రైతులకు పంటల రక్షణపై తగిన సూచనలు అందించాలని, ఇప్పటికే కోతలు పూర్తిచేసిన రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరుచుకునేందుకు సమీపంలోని రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ మాట్లాడుతూ రైతులకు అవసరమైన టార్పాలిన్లు జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని
ఈ నెల 31వ తేదీలోగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు, గోనె సంచులు, కార్మికులు సహా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ,రైస్ మిల్లర్ల నుంచి అవసరమైన గోనె సంచులను సేకరించి రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని
రైస్ మిల్లర్ల నుంచి ఈ నెల 31వ తేదీలోగా అవసరమైన ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీలను సేకరించాలని సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వహించే టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు, కస్టోడియన్ అధికారులకు నిర్దేశిత గడువులోగా శిక్షణ పూర్తి చేయాలని సూచించారు.
కనీస మద్దతు ధర ,ధాన్యం నాణ్యత ప్రమాణాలు ( వాట్సాప్ షెడ్యూలింగ్, బయోమెట్రిక్ విధానాలపై గ్రామసభలు, మైక్ ప్రకటనలు, టామ్ టామ్ బండ్ల ద్వారా ప్రచారం మార్గాల్లో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
ధాన్యం సేకరణ, రవాణాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో వాహనాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను గుర్తించి, వాటికి జీపీఎస్ పరికరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని రైస్ మిల్లర్లు ధాన్యం సేకరణ ప్రారంభానికి ముందే అవసరమైన బ్యాంకు, గ్యారంటీలను నాణ్యమైన గోనె సంచులను సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.
ధాన్యం విక్రయ సమయంలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ నంబర్ 81216 76653 కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆమె అన్నారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల పంటలు, ధాన్యానికి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఖరీఫ్ 2026–27 ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ స్పష్టం మైన ఆదేశాలను జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్.సరోజ, వ్యవసాయ శాఖ, కోపరేటివ్ ట్రాన్స్ పోర్ట్ ,మార్కెటింగ్ , లీగల్ మెట్రాలజీ , ఎం ఎల్ వో లు, సీఎస్ డీటీలు సి ఎస్ ఆర్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.