జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ ను మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్సించి, అక్కిడినుంచి పూనారావాస కేంద్రాల పనితీరు, సిబ్బంది విధులు పరిశీలించారు

Publish Date : 27/10/2026
WhatsApp Image 2026-10-27 at 9.32.48 PM

జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ ను మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్సించి, అక్కిడినుంచి పూనారావాస కేంద్రాల పనితీరు, సిబ్బంది విధులు పరిశీలించారు. సిబ్బంది కి తగు సూచనలు జారీ చేశారు.
కంట్రోల్ రూమ్ లో పోలీస్, రెవెన్యూ, ఫైర్, విద్యుత్, తదితర శాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా తుఫాను బాధితులు తమ సమస్యను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299181 కు ఫోన్ చేసి తెలియ చేయవచ్చని అన్నారు. కంట్రోల్‌ రూమ్‌ లో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తం గా ఉండాలని తెలిపారు.
అత్యవసర సమాచారం సేకరణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సహాయ అభ్యర్థనలపై తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే తెలియచేయాలని అన్నారు. తుఫాన్‌ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలను తక్షణమే చేపట్టేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.