జిల్లాలో నవంబర్ 1న నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 31/10/2026
WhatsApp Image 2026-10-31 at 5.25.53 PM

జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2026 నవంబర్ 1వ తేదీ ఆదివారం పోలింగ్ ఆయా మున్సిపాలిటీలు పరిధిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పట్టణాల అభివృద్ధికి, సమర్థవంతమైన స్థానిక పాలనకు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేయాలని కోరారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
ఓటర్లు ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ, తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.