పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Publish Date : 31/10/2026
పశ్చిమగోదావరి జిల్లాలో అర్నబ్ తుఫాను ప్రభావం దృష్ట్యా వ్యవసాయం, ఉద్యానవనం, మత్యశాఖ, రోడ్డు భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గృహ నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాలతో సహా వివిధ రంగాలలో వాటిలిన నష్టాలను అంచనావేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంటర్ టీం ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్.వి సతీష్ సీమకుమారి, డైరెక్టర్ జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యుసి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఈ బృందం పెనుగొండ, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు. వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించి తుఫాను సమయంలో తీసుకున్న చర్యలు నష్టాల్ని తెలుసుకుంటారని అన్నారు.