జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ఆన్‌లైన్‌లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..

Publish Date : 06/11/2026
WhatsApp Image 2026-11-05 at 3.19.41 PM (1)

జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా జరుగుతున్న పోలింగ్ సరళి, ఓటర్ల హాజరు, పోలింగ్ శాతం, ఎన్నికల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

ఈ పర్యవేక్షణలో కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో జీ రమణ ఉన్నారు.