Close

యాదావిధిగా నేడు (సెప్టెంబర్ 7 న) జిల్లా, డివిజన్, మండల కేంద్రాల లో ప్రజా సమస్య ల పరిష్కార వేదిక–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 07/09/2026

జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంసెప్టెంబర్ 7వ తేదీన జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్ మరియు మండల కేంద్రాలలో నిర్వ హించబడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు*.

అదేవిధంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సంబంధిత ఆధార పత్రాలతో సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అర్జీల స్వీకరణ, పరిశీలన మరియు పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా మరియు మండల స్థాయి అధికారుల సమన్వ యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడి నట్లు తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకో వచ్చని తెలిపారు. అర్జీల స్థితి, పరిష్కా ర ప్రక్రియ లేదా ఇతర సమాచారం కోసం “మీకోసం” టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 ను సంప్ర దించవచ్చని సూచించారు. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించుకొని మీరు పెట్టుకున్న అర్జీ నెంబర్ కి ఫీడ్ బ్యాక్ ఇస్తే, తదుపరి సంబంధిత అధికారి మిమ్మల్ని సంప్రది స్తారని అన్నారు. నడవలేని వారు, మంచానికే పరిమి తమైన వారు, తీవ్రమైన అనారో గ్యంతో బాధపడు తున్న వారిని పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలకు తీసుకు రాలవద్దని తెలిపా రు.అలాంటి వారి సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్రతినిధుల ద్వారా తెలియ జేయవచ్చని పేర్కొన్నారు. పి.జి.ఆర్.ఎస్‌కు హాజరయ్యే ప్రజల కోసం తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి సౌకర్యాలతో పాటు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడినట్లు తెలిపారు. అందిన అర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కా రానికి తక్షణ చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ స్పష్టం చేశారు.