Close

రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం (RBSK)

Publish Date : 30/07/2026

పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు మరియు ఎదుగుదల లోపాలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
మాతృ సంరక్షణ కార్యక్రమం & జనని సురక్ష యోజన (JSY) / జనని శిశు సురక్ష కార్యక్రమం (JSSK): గర్భిణీ స్త్రీలకు మరియు పుట్టబోయే శిశువుకు సంపూర్ణ రక్షణ కల్పించేలా, ప్రభుత్వ ఆసుపత్రులలో సురక్షిత ప్రసవాలు (Deliveries) జరిగేలా చూడాలని, అలాగే ప్రసూతి సేవలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ & ఐ స్క్రీనింగ్ (కంటి వెలుగు తరహా కార్యక్రమాలు): పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు (Eye Screening) నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
OP & IP సేవల మెరుగుదల: ఆసుపత్రులకు వచ్చే ఔట్ పేషెంట్స్ (OP) మరియు ఇన్ పేషెంట్స్ (IP) కు మెరుగైన సేవలు అందుబాటులో ఉండేలా, ఆసుపత్రులలో మౌలిక వసతులు మరియు మందుల లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.