జూన్ 5న మార్టేరులో “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” నాలుగవ విడత కార్యక్రమం
ఉదయం 9.30 గంటల నుంచి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం
… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా జూన్ 5న ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మార్టేరు జడ్పీ స్కూల్ పక్కన ఉన్న వేణుగోపాల స్వామి ఆడిటోరియం నందు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు, వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆచంట నియోజకవర్గంలో మే15న తొలి విడత, మే 22న రెండో విడత, మే29న మూడవ విడత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. జూన్ 5న ఆచంట నియోజకవర్గంలో నాల్గవ విడత కార్యక్రమంతో ఆచంట నియోజకవర్గంలో నాలుగు విడతల పిజిఆర్ఎస్ కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే జిల్లా, డివిజన్, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు ఉదయం 9.00 గంటలకే మార్టేరు గ్రామం వేణుగోపాలస్వామి ఆడిటోరియంకు తప్పనిసరిగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.