Close

మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం సుభిక్షంగా ఉంటుంది.

Publish Date : 08/03/2026

మహిళా ఆరోగ్యమే కుటుంబ జీవనాధారం

భారతీయ సంస్కృతిలో స్త్రీలను దేవతామూర్తులుగా స్థానం కల్పించి గౌరవించారు.

నేడు మహిళలు అన్ని రంగాలలో విశేషమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు.

…రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం నందు ఆదివారం జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పిఎసి చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విజయ భారతి షైనీ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, ఏఎంసి చైర్మన్ కలిదిండి సుజాత, ఏపీ కృష్ణ బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ బూసి వినీత, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలైన అమెరికా, డెన్మార్క్ లలో మహిళా దినోత్సవం కేవలం ఆ దేశ జాతీయ దినోత్సవంగానే జరుపుకునే వారిని, 1977 లో ఐక్యరాజ్యసమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించిందన్నారు. ఏ కార్యక్రమం చేపట్టి దిగ్విజయం చేయాలన్న పురుషుల కన్నా స్త్రీలు మానసికంగా దృఢత్వం గా ఉంటారన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్త్రీలకు సమాన ఆస్తి హక్కు కల్పించారన్నారు. నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకం ప్రారంభించిన మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా మహిళలు నేడు ఆర్థికంగా ఎదుగుతున్నరన్నారు. మహిళలు సంతతిపై ఆడ, మగ బేధభావం లేకుండా ఉండాలన్నారు. నేటి పరిస్థితులలో ఆడపిల్లలకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆడపిల్ల అంటే భారం అనే భావన విడనాడాలన్నారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందు ఉంటున్నారన్నారు. సమాజంలో మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కుటుంబం అభివృద్ధి మహిళల నిర్వహణ పైన ఆధారపడి ఉంటుంది అన్నారు. నేడు చట్టసభల్లో కూడా మహిళలు తమదైన వాణిని వినిపిస్తున్నారన్నారు. సమాజంలో మహిళలకు సముచితమైన గౌరవం కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ
ఒక దేశం నిజమైన పురోగతిని సాధించాలంటే ఆ దేశంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా స్వతంత్రులుగా ఉండాలన్నారు. ఈ లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకాల ద్వారా మహిళల జీవితాల్లో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. 1,626 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు పౌష్టికాహారం అందుతోందన్నారు. పి ఎం ఎం వి వై పథకం ద్వారా 3,692 మంది తల్లులకు సుమారు రూ.1.06 కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. మహిళల రక్షణ కోసం వన్ స్టాప్ సెంటర్, 181, 1098 హెల్ప్‌లైన్లు 24 గంటలు సేవలందిస్తున్నాయని తెలిపారు. ప్రతి నెలా 1.30 లక్షల మహిళలకు సుమారు రూ.53.76 కోట్లు పెన్షన్లుగా అందించడం జరుగుతుంది అన్నారు. స్వయం సహాయక సంఘాలకు 2025-26లో రూ.805.89 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరు చేయగా, రికవరీ రేటు 99.98% ఉండటం మహిళల క్రమశిక్షణకు నిదర్శనం అన్నారు. స్త్రీ నిధి, ఉన్నతి పథకాల ద్వారా కూడా మహిళలకు ఆర్థిక సహాయం అందుతోందనీ తెలిపారు. జిల్లాలో మహిళలు సేంద్రీయ ఎరువుల తయారీ, చాక్లెట్ తయారీ వంటి వినూత్న వ్యాపారాలు స్థాపించడం జరిగింది అన్నారు.. డిజిటల్ లక్ష్మి ద్వారా వేలాది ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా, కొంతమంది మహిళలు నెలకు రూ.65 వేలు నుండి రూ.80 వేలు వరకు సంపాదిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో అమ్మాయిలు 85.56% తో అబ్బాయిలకంటే మెరుగైన ఫలితాలు సాధించారని వెల్లడించారు. “శక్తి టీమ్స్” మహిళల భద్రత కోసం 24 గంటలు పనిచేస్తున్నాయి. విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ కూడా అందించడం జరుగుచున్నదని తెలిపారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా కోట్లాది మహిళలు ప్రయాణిస్తున్నారన్నారు. ఉజ్వల యోజన ద్వారా వేలాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడంతోపాటు, . పి lఎంఏవై ద్వారా వేలాది ఇళ్లు మహిళల పేరుపై నిర్మించబడుతున్నాయన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే వారు కుటుంబానికే కాకుండా సమాజం, దేశ అభివృద్ధికి పెద్ద పాత్ర పోషిస్తారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకొని మహిళలు మరింత ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

భీమవరం శాసనసభ్యులు మరియు ఏపీసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదన్నారు. స్త్రీ అంటే ఇంటికి ఇలవేల్పు మహాలక్ష్మి అని ఆ స్త్రీని గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారన్నారు. నేడు ప్రభుత్వాలు అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విజయ భారతి షైనీ, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత స్త్రీల హక్కులు, ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, సమాజంలో వారి ప్రస్తుత గమనం తదితర విషయాలపై ప్రసంగించారు.

చివరిగా మహిళా దినోత్సవ సందర్భంగా ముద్ర, పిఎంఈజీపి, పీఎం ఎఫ్ఎంఈ, విశ్వకర్మ పథకాల కింద 62, 833 మంది లబ్ధిదారులకు రూ.823.40 కోట్లు బ్యాంకు రుణాలు, 9,171 ఎస్ హెచ్ జి సంఘాలకు రూ.1,098,75,00,000/- ఒక వెయ్యి 98 కోట్ల 75 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు, 156 నంది ఎస్సీ ఎస్ హెచ్ జి లబ్ధిదారులకు కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన ఉన్నతి, వడ్డీ లేని రుణాలు రూ.2,08,50,000/- లు, 6,619 ఎస్ హెచ్ జి సభ్యులకు స్త్రీ నిధి, ఉన్నతి, సిఐఎఫ్ రుణాలుగా రూ.2,35,28,00,000/- లు నమూనా చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

అలాగే పెంటపాడు మండలం ఎఫ్డిఓ కు డి ఆర్ డి ఏ, సెర్ఫ్ ద్వారా రూ.8 లక్షలు విలువైన ట్రాక్టర్ ను కష్టం హైరింగ్ సెంటర్ కు అందజేయడం జరిగింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సెర్ఫ్, మెప్మా సంస్థల ఆర్థిక ప్రోత్సాహంతో వివిధ వ్యాపారాలు, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధించిన పారిశ్రామిక వేత్తలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మెమొంటోలతో సత్కరించి అభినందించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగినులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ముందుగా భీమవరానికి చెందిన సెంట్ మేరీస్, ఆదిత్య స్కూలు, విష్ణు కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఒ బి.శివన్నారాయణ రెడ్డి, ఐసిడిఎస్ పిడి డి లక్ష్మి, డి ఆర్ డి ఎ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, సిపిఓ కే శివ పార్వతి, డీఎస్ఓ ఎన్.సరోజ పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, డీఈవో ఇ.నారాయణ, జిల్లా చేనేత,జౌళి శాఖ అధికారి కె.అప్పారావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్.వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ హెప్సిబా, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, పాఠశాలల కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.