Close

పిజిఆర్ఎస్ లో అందిన ప్రతి వినతిని అధికారులు ఓర్పుతో చదివి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

Publish Date : 02/03/2026

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి.

నేడు పి జి ఆర్ ఎస్ లో 179 దరఖాస్తులు… రెవెన్యూ క్లినిక్ లో 32 దరఖాస్తులు స్వీకరణ.

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి కెసిహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులకు నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పీజీ ఆర్ఎస్ ద్వారా అందిన ప్రతి వినతిని ఓర్పుతో చదివి సంబంధిత శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిపాలనలో ప్రజా సమస్యల పరిష్కారం ప్రాధాన్యత గల అంశం అని, ఫిర్యాదుల పరిష్కారములో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం లబ్ధిదారులు సంతృప్తి స్థాయి పెరిగే విధంగా ఉండాలన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాన్ని లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, ఆర్డబ్ల్యూ ఎస్, ఆర్టీసీ సంబంధిత శాఖలకు సంబంధించి సమస్యలపై ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజలు తెలియజేసే స్పందన పాజిటివ్ గా ఉండే విధంగా సమస్యల పరిష్కార చర్యలు ఉండాలన్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

నేడు భూ సంబంధిత సమస్యలు, కొత్తగా వికలాంగ, వితంతు పెన్షన్లు, గృహ నిర్మాణం, ఇళ్ళు మంజూరు, సీనియర్ సిటిజన్స్ సమస్యలు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.

& తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఇవ్వల సత్యనారాయణ అర్జీ సమర్పిస్తూ, వేల్పూరు గ్రామంలో తనకు 40 సెంట్లు వ్యవసాయ భూమి ఉందని, ఆడంగల్ నందు గడ్డి భూమిగా నమోదయిందని, మా పొలాన్ని రెగ్యులర్ ఖాతాగా మార్పు చేసి మా పేరును పాస్ బుక్ ఇప్పించాలని కోరారు.

& కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన సోడదాసి లీలమ్మ అర్జీ సమర్పిస్తూ, తన భర్త అనారోగ్య కారణంగా మరణించారని, మాకు ఇంతవరకు రేషన్ కార్డు మంజూరు కాలేదని, రేషన్ కార్డు కొరకు పంచాయతీ కార్యాలయానికి తిరిగిన సమాధానం చెప్పడం లేదని, దయచేసి రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు.

& తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన ఈర్లపాటి మంగ అర్జీ సమర్పిస్తూ, నా ఇంటి స్థలంలో విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ స్తంభాలు పాతారని, దీనివల్ల ఇంటి నిర్మాణం చేసుకోవడానికి వీలు లేకుండా పోయిందని, స్తంభాలను తొలగించవలసిందిగా తాడేపల్లిగూడెం పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, దయచేసి విద్యుత్ స్తంభాలను తొలగించాలని కోరారు.

& ఉండి మండలం,చెరుకువాడ గ్రామానికి చెందిన బొ ర్ర నాగ వెంకట శివశంకర్ తాను మానసిక వికలాంగుడునని, 75% వికలాంగత్వం ధ్రువీకరణ పత్రం ఉందని, వైద్య ఖర్చులకు, జీవనోపాధికి చాలా ఇబ్బంది పడుతున్నానని, దయచేసి వికలాంగ పింఛను మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

& భీమవరం మండలం, జొన్నలగరువు గ్రామానికి చెందిన గోరం చిన్న సామేలు 62 సంవత్సరములు మూడు సంవత్సరములు క్రితము గుండె ఆపరేషన్ జరిగినదని, ఏ విధమైన ఆదాయము లేదని, వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.

& పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన కూనిసేట్టి నాగలక్ష్మి అర్జీ సమర్పిస్తూ విస్సా కోడేరు గ్రామంలో 1.85 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని రిసర్వే లో 10 సెంట్లు భూమి తక్కువగా నమోదు అయిందని, తిరిగి సర్వే చేయించి తగ్గిన 10 సెంట్ల భూమి తనకు ఇప్పించాలని కోరారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వృద్ధుల సంక్షేమ అప్పీల్లేట్ ట్రిబ్యునల్ మెంబెర్ మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

1.111