Close

డిజిటల్ భవన్ లో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 28/02/2026

శనివారం పి.ఎం లంకలో జరిగిన పడవల పంపిణీ కార్యక్రమం అనంతరం ఆమె డిజిటల్ భవన్‌ను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణలను స్వయంగా పరిశీలించి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో చరవాణిలో స్వయంగా నేర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ భవన్‌లో ఉచితంగా నాణ్యమైన కోర్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు ఈ అవకాశాలను వినియోగించుకుని తమ ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని సూచించారు. నైపుణ్య శిక్షణలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని ఆమె తెలిపారు. శిక్షణలో పాల్గొనే వారు శ్రద్ధగా నేర్చుకుని తమ జీవితాల్లో పురోగతి సాధించాలని కోరారు. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ రంగంలో మంచి అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ఆ కోర్సుపై పూర్తి దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షణ సిబ్బంది మరియు అభ్యర్థులు పాల్గొన్నారు.