Close

ఎంపీడీవోలు, తహసిల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 19/02/2026

ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతం చేసి ఈ వారాంతానికి నూరు శాతం ప్రగతి సాధించాలి.

ఈ కేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గురువారం ఏకీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ అంశాలపై ఎంపీడీవోలు, తహసిల్దారులు సంబంధిత అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతం చేసి ఈ వారాంతానికి నూరు శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసిల్దార్లు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలన్నారు. ఏకీకృత కుటుంబ సర్వే ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడి ఉండడంఫై సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 6,30,855 గృహాలు సర్వే చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 4,10,587 గృహాలు సర్వే పూర్తయిందని ఇంకను 2,20,268 గృహాలు సర్వే పూర్తి చేయవలసి ఉందని, అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఇంకను 1,39,453 మందికి ఈ కేవైసీ చేయవలసి ఉండగా ఈరోజు వరకు 42,487 మందికి ఈ కేవైసీ పూర్తి చేయడం జరిగిందని ఇంకను 85,884 ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉందని, కావున ఈకేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏకీకృత కుటుంబ సర్వే ఈ కేవైసీ ప్రక్రియపై ప్రతిరోజు సమీక్షించాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది ఉదయం 7. 00 గంటల నుండి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవోలు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బంది పనితీరును పరిశీలించాలన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ వారాంతం నాటికి ఏకీకృత కుటుంబ సర్వే నూరు శాతం సాధించేందుకు అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జి.గీతాబాయి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.