Close

జిల్లాలో పీఎం శ్రీ పథకం క్రింద ఎంపిక చేసిన పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Publish Date : 12/02/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పీఎం శ్రీ, ఏ డబ్ల్యు పి అండ్ బి, మనబడి మన భవిష్యత్తు పథకాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పిఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాల నందు అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, తదితర పనులు చేపట్టడానికి 104 పనులను కేటాయించడం జరిగిందని, వీటిలో 42 పనులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ డబ్ల్యు పి అండ్ బి పథకం 76 పనులను కేటాయించడం జరిగిందని, వీటిలో వివిధ ల్యాబ్లు నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే మనబడి మన భవిష్యత్తు పథకం కింద చెరుకువాడ, మొగల్తూరు పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. పనులు చేపట్టిన పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీ డబ్ల్యూ ఐ డి సి, పీహెచ్డీ, ఎస్ఎస్ఎ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఈవో ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యామ్ సుందర్, డిఈ జి.నాగేంద్ర శేఖర్, ఏఈ ఎన్.రమేష్, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీ డబ్ల్యూ ఐ డి సి, పీహెచ్డీ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.