Close

పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో తప్పులకు తావు లేకుండా చూడాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 11/02/2026

అప్సడ రిజిస్ట్రేషన్‌లో అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు

అప్సడ (AP-SDA) రిజిస్ట్రేషనల ప్రక్రియలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

జిల్లా కలెక్టరేట్‌ ఛాంబర్‌ నుండి బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీవోలు, మత్స్య శాఖ అధికారులు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా అప్సడ రిజిస్ట్రేషన్లు, నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అప్సడ రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే రైతులను అవసరం లేకుండా విఆర్వోను కలవాలని సూచించకూడదన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు నేరుగా తహసిల్దార్లను కలిసి పరిష్కారం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెబ్ ల్యాండ్ లో భూమి వివరాలు సమగ్రంగా నమోదై ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సత్వరమే పూర్తి చేయాలని సూచించారు.

మార్చి నెలలో నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో అధికారులు లక్ష్యసాధనకు కట్టుబడి పనిచేయాలని పేర్కొన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో చిన్న తప్పు కూడా దొర్లకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. రైతుల నుండి వివిధ సమస్యలపై అందుతున్న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియపై సంబంధిత ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి పనులు సమయానికి పూర్తయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ గూగుల్ మీట్ సమావేశంలో డిఆర్ఓ బి.నారాయణరెడ్డి, ఆర్డీవో కె.రామచంద్రారెడ్డి, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్, జిల్లాలోని తహసిల్దార్లు, ఎఫ్‌డిఓలు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.