ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలి-రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు
రైతులు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం ఐసిఏఆర్ భారతీయ వరి పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ సంస్థ సౌజన్యంతో ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధించి రూ.28 లక్షల విలువ గల బ్యాటరీ స్ప్రేయర్లను అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ముఖ్య అతిథులుగా పాల్గొని, వారి చేతుల మీదుగా ఉండి నియోజకవర్గానికి చెందిన నాలుగు వందల మంది ఎస్సీ రైతులకు స్ప్రేయర్లను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ రైతులు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న రైతులకు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. అధునాతన పద్ధతిలో ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయ పనిముట్లు కూడా నూతన సాంకేతికతో ఉండాలని అందువల్లే ప్రభుత్వం వీటిని అందిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వ పథకాలు సబ్సిడీ పంటల భీమా వంటి వాటిపై మరింత అవగాహన కలిగి లాభసాటిగా అభివృద్ధి సాధించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సాంప్రదాయ సాగుతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ టెక్నాలజీ, పంటల నమోదు, మార్కెటింగ్ విలువ జోడింపు, సేంద్రియ వ్యవసాయం వంటి రంగాల్లో పరిజ్ఞానం పెంచుకొని ఆదాయం గణనీయంగా పెంచుకోవాలన్నారు. ఎక్కడా లేని విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ రైతులకు ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలు ఉచితంగా పంపిణీ చేయడానికి కృషిచేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘు రామకృష్ణ రాజుకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ అవకాశమును రైతులందరూ సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ప్రతాప్ జీవన్, ఉండి ఆకివీడు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కలిదిండి రామకృష్ణ రాజు, బొల్లా వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మల శ్రీనివాసరావు, రమేష్ నాయుడు, బి.సంధ్య, కరి మేరక నాగరాజు, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.