Close

జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే మంచి ప్రగతి సాధించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 02/02/2026

పీజీ ఆర్ఎస్ సమావేశం అనంతరం సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వాట్సాప్ గవర్నెన్స్, ఐ గాట్, ఈపిటిఎస్ పోర్టల్ లో ఫైల్స్ అప్లోడింగ్, పీ4, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్, పీ 4, ఈపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్, ఐగాట్ పోర్టల్ ప్రభుత్వ ఉద్యోగుల ఆన్లైన్ కోర్సులు తదితర కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, కావున అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి మంచి పురోగతి సాధించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రజలు వాట్సాప్ సేవలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల ఐగాట్ ఆన్లైన్ కోర్సులపై సమీక్షిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఐ గాట్ పోర్టల్లో వందలాది ఆన్లైన్ కోర్సులు ఉన్నాయని, ప్రతి ఉద్యోగి వారికి నచ్చిన కోర్సులు చేయడం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు అన్నారు. జిల్లా అధికారులు తమ సిబ్బందితో వారికి అనువైన కోర్సులు చేసే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శాఖల వారి ప్రగతిని సమీక్షించి మంచి పురోగతి సాధించాలన్నారు.

ఈపిటి ఎస్ ఫైల్స్ అప్లోడింగ్ పై సమీక్షిస్తూ ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రతి ఫైలు, ప్రొసీడింగ్స్, సర్కులర్స్, జీవోలు తప్పనిసరిగా ఇపిటిఎస్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు పైల్స్ అప్లోడింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి మండలానికి లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు కృషి చేయాలి అన్నారు.

పి 4 ఫోర్ సమీక్షిస్తూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా పి -4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని వారి లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. మార్గదర్శిల ద్వారా బంగారు కుటుంబాలకు ఏ విధంగా సహాయం అందుతున్నది తెలుసుకోవాలన్నారు. సహాయం అందకపోతే వారిని కలిసి కారణాలు తెలుసుకొని మరొక మార్గదర్శిని అనుసంధానం చేసి బంగారు కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని. ఇప్పటికే ఎంపిక చేసిన మార్గదర్శలను బంగారు కుటుంబాలకు అనుసంధానం చేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పీడి డాక్టర్ కె. సి హెచ్ అప్పారావు, స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు జిల్లా అధికారి వై.దోసి రెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.