వాసవి పెనుగొండ ఎస్ వి కె పి అండ్ డా .కె ఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఫిబ్రవరి 5 నిర్వహించే ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు
కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా సోమవారం ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే వాసవి పెనుగొండ డా. కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఈ నెల 5 వ తారీఖున ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 15 కంపెనీలలో ఉద్యోగఅవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. చదువు పూర్తి చేసుకున్న యువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు. కంపెనీల నియమాలను అనుసరించి ఎంపిక చేస్తారని, నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ నందు https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, ఇతర వివరములకు ఈ క్రింది నెంబర్ల నందు 8688595244, 9502024765
సంప్రదించాలని తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా.పి.లోకమాన్, యంగ్ ప్రొఫెషనల్ కిషోర్ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసి రెడ్డి , డ్వామా పిడి డా.కె సి హెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏఓఎన్ వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.