Close

జిల్లా ఆసుపత్రి తణుకులో దశలవారీగా అన్ని వైద్య సదుపాయాలు కల్పించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు తణుకు నియోజవర్గం శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.

Publish Date : 29/01/2026

జిల్లా ఆసుపత్రి, తణుకు నందు బ్లడ్ సెంటర్, హీమోఫీలియా ట్రీట్మెంట్ సెంటర్, ఫిజియోథెరపీ విభాగములనుతణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధ కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డా.పగడాల సూర్యనారాయణ , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధ కృష్ణ మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడుకున్న హీమోఫీలియా వైద్యాన్ని కూటమి ప్రభుత్వంలో పూర్తిగా ఉచితంగా అందించుటకు మన జిల్లా ఆసుపత్రి, తణుకు నందు ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు లైసెన్స్ ప్రతిపాదనలు పంపినప్పటినుంచి జిల్లా కలెక్టర్ మార్గదర్శకంలో జాయింట్ కలెక్టర్ సహాయ సహకారాలతో త్వరిగతిన లైసెన్స్ రావటం హర్షించదగిన విషయం అన్నారు. అన్నిహంగులతో ఫిజియోథెరపీ సెంటర్ ని ఏర్పాటు చేయడం ప్రజలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు జిల్లా ఆసుపత్రికి వస్తూ ఉంటారని, రోజులో సరాసరి 150 మంది వరకు జిల్లా ఆస్పత్రిలో ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయని అన్నారు. తణుకు జిల్లా ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేయడానికి సర్వీస్ లు పెరగటానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రక్త కోర్స్ యాప్ ద్వారా ఏ బ్లడ్ బ్యాంకులో ఏ రకం బ్లడ్ యూనిట్లు ఉన్నవి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు జిల్లా ఆసుపత్రిలో ఈ యాప్ లో బ్లడ్ యూనిట్లు వివరాలను పొందుపరిస్తారని ఏ గ్రూపు బ్లడ్ కావాలన్నా ఈ యాప్ ద్వారా సమాచారం తెలుసుకొని బ్లడ్ బ్యాంక్ ద్వారా పొందవచ్చునని అన్నారు. వాట్సప్ సమాచారం ద్వారా ఎక్కువమంది బ్లడ్ డోనర్స్ వచ్చేలా చేయాలని అన్నారు. జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా 2025 సంవత్సరంలో బ్లడ్ ను సేకరించి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగిందని అన్నారు. ఈసారి 2 వేల యూనిట్ల వరకు బ్లడ్ సేకరించి వాటిలో 30% జిల్లా ఆసుపత్రికి పంపడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజులలో తణుకు జిల్లా ఆస్పత్రి ఒక మేజర్ హబ్ గా ఏర్పడి ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా సేవలు అందించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి .రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. తణుకు చుట్టూ ప్రక్కల పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్.డి.ఓ కతీబ్ కౌసర్ బానో, పశ్చిమ గోదావరి జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా.పి.సూర్య నారాయణ, తణుకు జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.కె.సాయి కిరణ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వల్లూరి గంగారావ్, సుంకర ప్రసాద్, డా.ఆయేషా ఖాన్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.