అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్స్ ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి కావాలి.
ఆక్వా సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మండలాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అప్సడా రిజిస్ట్రేషన్ల పై మత్స్య శాఖ అధికారులు, ఎఫ్ డి ఓ లు, ఎండివోలతో మండలాలు వారిగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,31,436 ఎకరాలలో ఆక్వాసాగు జరుగుచున్నదని, ఇప్పటివరకు 66,340 ఎకరాల విస్తీర్ణంలో అప్సడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగిందని, 39,413 ఎకరాలు అప్సడాలో రిజిస్టర్ కావలసి ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయించాలని మత్స్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ కారణాల దృష్ట్యా 25,315 ఎకరాల రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదన్నారు. చెరువులు, రొయ్యల సాగు రైతులు అందరూ వెంటనే అప్సడాలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల ద్వారా చట్టబద్ధ అనుమతి, ప్రభుత్వ పథకాలలబ్ధి, వివాదాల నివారణ వంటి ప్రయోజనాలు కలుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఎక్కువ ఆక్వా సాగు విస్తీర్ణం ఉన్న ఆకివీడు, భీమవరం, గణపవరం, మొగల్తూరు, నరసాపురం, కాళ్ళ, వీరవాసరం మండలాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను తక్షణ రిజిస్ట్రేషన్ల కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులు ఆదేశించారు.
ఈ గూగుల్ మీట్ లో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్, సహాయ సంచాలకులు ఎల్ఎల్ రాజు, ప్రసాద్, ఎంపీడీవోలు, ఎఫ్ డి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.