Close

విద్యార్థులు క్రమశిక్షణ, శ్రద్ధ, లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 21/01/2026

గునుపూడి రైతు బజార్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల, బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థినిలతో సమావేశమై వారితో అనేక విషయాలపై మాట్లాడుతూ సమాధానాలను తెలుసుకున్నారు. ఎలా చదువుతున్నారు, హాస్టల్ లో వసతి ఎలా ఉంది, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా, అందరికీ మంచాలు, దోమతెరలు ఉన్నాయా తదితర విషయాలపై ఆరా తీశారు. హాస్టల్లో వుండి ఇంజనీరింగ్ చదువుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్ కు ఎంపికైన జోగి వినీత, హెప్సిబా, సుస్మిత విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. మీరు ఎలా ప్లేస్మెంట్స్ సాధించారో మీతో వసతి గృహంలో ఉంటున్న పాఠశాల విద్యార్థులకు వివరించాలని, వారితోనే స్వయంగా మాట్లాడించి విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ క్రమశిక్షణ, శ్రద్ధతో లక్ష్యంపై దృష్టి సారించాలని, అప్పుడే లక్ష్యాలను సాధించగలరన్నారు. అందరూ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి ఉత్సాహం చూపించడం కన్నా సివిల్, ఎలక్ట్రానిక్స్, బిసిఎ వంటి కోర్ కోర్సులను చదవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని వివరించారు. చదువుతోపాటు సమాజంపై అవగాహనతో స్వతహాగా జీవించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉత్తమంగా ఉంటుందని, కౌన్సిలర్స్ ను కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మాత్రమే ప్రభుత్వం ఒకేషనల్ కోర్సులను 12 కోర్సులు నందు అందించడం జరుగుతుందని, ప్రస్తుతం తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు జరుగుచున్నయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 6 నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు కూడా ఒకేషనల్ కోర్సులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఒకేషనల్ కోర్సులు నందు శిక్షణ పొందిన విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏమి చదవాలి అనే మీమాంస ఉండదని, ఒక చక్కటి దారి ఏర్పడుతుంది విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.

అనంతరం వంటగదిని, ఆహార పదార్థాలను, విద్యార్థుల వసతి గదులను స్వయంగా పరిశీలించి మంచాలు, దోమతెరలు, కిటికీలకు మెష్, తదితర వాటని పరిశీలించారు.

ఈ సందర్భంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణ్ కుమారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆకుల సూరిబాబు, ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల హెచ్ డబ్ల్యు ఓలు సిహెచ్ భానుమణి, జి.శ్యామల, వసతి గృహం విద్యార్థులు ఉన్నారు.