పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు మరొక అవార్డు…
జనవరి 25న నిర్వహించే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో ఉత్తమ చర్యలను చేపట్టిన వివిధ జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులను ఎంపిక చేయడం జరిగింది.
దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న ఉత్తమ చర్యలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పశ్చిమగోదావరి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి ని “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డులు, 2025” కు ఎంపిక చేయడం జరిగింది.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జనవరి 25 ఉదయం 11.00 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి ఈ అవార్డును స్వీకరించనున్నారు. మొత్తం 12 జిల్లాలను వివిధ విభాగాలలో ఎంపిక చేయగా అత్యధిక ఓటర్ల నమోదు విభాగంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారిని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది.
ఈ రోజు సందర్భంగా జిల్లా కలెక్టర్ ను అభినందించిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.